Whatsapp Fraud: ఇంటి నుండి ఒక రోజుకి రూ.5000 సంపాదించే అవకాశం!!! మోసపోకండి…

0
600
Whatsapp Fraud

వాట్సాప్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు సమాచారం మరియు మోసxపూరిత లింక్‌లను వ్యాప్తి చేయకుండా ఉండడానికి కంపెనీ రక రకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ వాట్సాప్ ద్వారా ఇప్పటికి ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. స్కామ్ చేసేవారు ప్రజలను మోసగించడానికి కొత్త కొత్త మార్గాలు మరియు కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రస్తుత మెసేజ్ యాప్ వాట్సాప్ లో ప్రసారం చేయబడుతున్న మెసేజ్ విషయానికి వస్తే వినియోగదారులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో తమను చేర్చుకున్న తర్వాత ప్రతి రోజు 5,000 రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తున్నారు.
ఈ మెసేజ్ లో ఒక లింక్ కూడా ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసినతర్వాత వెంటనే బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కోల్పోవచ్చు. ఇది పూర్తిగా మోసపూరిత మెసేజ్ కావున వాట్సాప్ వినియోగదారులు అలాంటి మెస్సేజిల వలలో పడవద్దని హెచ్చరిస్తున్నారు.