అల్లంటీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

0
137

అల్లం మసాలా దినుసు మాత్రమే కాదు, అల్లంతో అనేక ఉపయోగాలున్నాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ ఒక కప్పు అల్లం టీ తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.అనేక రకాల వ్యాధులను తట్టుకొనే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీ వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి.అలాగే హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి ఉపదయోగపడుతుంది. హృద్రోగాలు దూరంగా ఉంటాయి. అలాగే మహిళలకు నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి.గొంతులో మంట, ఆస్తమా, దగ్గు వంటివి రాకుండా ఉండటానికి అల్లం టీ లో రోజూ తేనె కలిపి తీసుకోవాలి.

అల్లం టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. మరియు రోగనిరోధక శక్తి పెరిగి,మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లంటీ లో ఉండే అరోమా వంటి గుణాలు మెదడులోని కనాలని ఉత్తేజితం చేస్తాయి. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు చేకూరుతుందట.జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో మరియు వాతావరణ మార్పుల వలన సంభవించే వ్యాధులతో బాధ పడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గొంతు ఇన్ఫెక్షన్స్ , వేవిళ్లు మరియు ఊపిరితిత్తులలో కఫము లాంటి వాటికి చెక్ పెట్టడంలో అల్లం టీ అద్భుతమైన దివ్యౌషధంగా పనిచేస్తుంది. మాములు టీలో అల్లంతో తయారుచేసిన బిస్కెట్లు కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.అజీర్ణం మరియు ఛాతీలో మంట వంటి సమస్యలకు అల్లం టీ తరచుగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


అల్లం టీని సేవించడం ద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు దరిచేరవు. అల్లం టీ రోజూ తీసుకుంటే మోకాళ్ల వాపులు కూడా తగ్గిపోతాయి. అలాగే ఏవైనా అనారోగ్యాలతో బాధపడేవారు తరచుగా అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.