మీ వాట్సాప్ సమాచారం సెక్యూర్ గా ఉండాలంటే ఇలా చేయండి.

వాట్సాప్ ని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకూ అందరూ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ని వాడటం అలవాటుగా మారిపోయింది.ఈ వాట్సప్ వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరితే, కొన్ని దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. రీసెంట్ గా గత కొన్ని వారాలుగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ వార్తలన్నీ చాలా వరకు ప్రైవసీ పాలసీ గురించి నెగిటివ్ గా వినిపిస్తున్నాయి.

2021 మే 15 వరకు వాట్సప్ తన యూజర్లతో లేటెస్ట్ ప్రైవసీ పాలసీని పాటించాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఫిబ్రవరి 8 వరకే అని చెప్పినా, ఇప్పుడు మరోసారి పొడిగించారు.అయితే డేటా సెక్యూరిటీ ప్రైవసీ అనేది భద్రంగా ఉంచుకోవటo చాలా ముఖ్యం.మరి ప్రైవసీ పాలసీ సెట్టింగ్స్ తో కుదరదా అంటే కుదురుతుంది. అయితే సెట్టింగ్స్ ఇలా చేసి వాట్సాప్ నుండి మీరు సేఫ్ గా ఉండండి.

వాట్సాప్ చాట్ మెసేజెస్ మాయమవడం:
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ మెసేజెస్ మాయమయ్యే ఫీచర్ ను వాట్సప్ తీసుకొచ్చింది. ఇక ఈ ఫీచర్ ని వాట్సాప్ సెట్టింగ్స్ లో ఆన్ లో ఉంచితే చాలు, చాటింగ్ చేసిన ఏడు రోజులకు లేదా మనం సెట్ చేసిన సమయంలోపల మొత్తం చాట్ డిలీట్ అయిపోతుంది.అవసరం అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకొని ఉంచుకోవచ్చు.

డివైస్ లింకింగ్ సెక్యూరిటీ అప్డేట్:
మీ ఫోన్ తో డెస్క్ టాప్ మీద వాట్సాప్ ఓపెన్ చేసుకోవచ్చు కానీ,లాప్ టాప్ లో కానీ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే,అడిషనల్ గా ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికోసం ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ రికగ్నిషన్ కానీ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి డివైజ్ ను లింక్ చేసుకోవచ్చు.ఇది కేవలం పర్సనల్ పీసీ లేదా లాప్టాప్ లో చేసుకోవటం ఉత్తమం.

గ్రూప్ సెట్టింగ్స్:
ఇక వాట్సాప్ ఎవరు పడితే వాళ్ళు, మనల్ని వారి గ్రూప్ లో ఆడ్ చేయకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి
అకౌంట్ ఆప్షన్ ఎంచుకొని, ప్రైవసీ లాక్ ఓపెన్ చేయగానే గ్రూప్ కనిపిస్తుంది అందులో ఉన్న మూడింటిలో మనకి కావలసిన ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.

వాట్సాప్ రెండు స్టెప్పుల(టు స్టెప్ ) వెరిఫికేషన్:
వాట్సాప్ యూజర్లు రెండు స్టెప్పులు(టు స్టెప్ ) వెరిఫికేషన్ కచ్చితంగా ఆన్ లో ఉంచుకోవాలి.ఎందువలన అంటే మన మొబైల్ కి వచ్చే టు స్టెప్ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసే వరకు లాగిన్ కాదు. ఇలా చేయడం వల్ల అడిషనల్ లేయర్ తో పాటు ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. ఇక 6 డిజిట్ ల పిన్ నెంబర్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ సెట్ చేసుకొని సేఫ్ గా ఉంచవచ్చు.

టచ్ ఐడి లేదా ఫేస్ ఐడి తో లాక్:
వాట్సాప్ యూజర్లకు ఇంకో సెక్యూర్ లేయర్ యాడ్ చేసి, సెక్యూరిటీ అందించింది వాట్సాప్. టచ్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ ఐడి పెట్టి,మీ ఫోన్ వాట్సప్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా రెగ్యులర్గా వాట్సాప్ అప్డేట్:
వాట్సాప్ యాప్ ను రెగులర్ గా అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల సెక్యూరిటీ ఫీచర్లు మెరుగుపడటమే కాకుండా పర్ఫామెన్స్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది.

వాట్సాప్ ప్రైవసీ ప్రొఫైల్:
పర్సనల్ ప్రొఫైల్ ఎవరు చూడకుండా చూసుకోవచ్చు. చివరగా చూసింది, ప్రొఫైల్ ఫోటో, మన గురించి స్టేటస్ వంటి వాటిని సెట్టింగ్స్లోకి వెళ్లి మార్చుకోవచ్చు.