బిత్తర పోయిన సింహం ఏనుగు నుంచి తప్పించుకుని పరుగు

అడవిలో బాగా ఆకలితో ఉన్న సింహం తనకి ఎదురుపడిన ఏ జంతువునైనా చంపి తన ఆకలిని తీర్చుకోటానికి ప్రయత్నిస్తుంది. అలాంటి అడవికిరాజు ఐన సింహం కి చాలా ఆకలితో ఉన్న సింహం కి ఒక ఏనుగు ఒంటరిగా ఎదురైనది అంతే ముందు వెనుకా ఆలోచన లేకుండా ఆ సింహం ఏనుగు మీదకి దూకింది. దానితో ఒక్కసారిగా షాక్ కి గురైన ఏనుగు అక్కడే కుప్పకూలింది. ఈ వీడియో తీస్తున్న వారుకూడా ఏనుగుకి సింహం చేతిలో మరణం అనుకున్నారు కానీ ఇక్కడే అసలు కథ మొదలైనది ఆ సింహం దెబ్బ నుండి ఒక్కసారిగా తేరుకున్న ఏనుగు తన బలం మొత్తం ఉపయోగించి తనమీద ఉన్న సింహాన్ని తన తొండంతో నేలకేసి కొట్టింది అంతే సింహం బిత్తరపోయి ఒక్క క్చణం ప్రాణం పోయి తిరిగి వచినట్లైనది. ఇక తేరుకున్న సింహం ఇక్కడే ఉంటె ఈ ఏనుగు చేతిలో చావు తప్పదనుకుని ఏనుగుకి దూరంగా బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి ఒక్కటే పరుగు పెట్టింది. కానీ ఏనుగు మాత్రం సింహంలా భయపడకుండా సింహం ని తరుముతూ దానివెంటే వెళ్ళింది. ఈ వీడియో Life and nature తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది మొదలు తెగ వైరల్ అవుతుంది.

Video Source Twitter @Life and nature