క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.క్రెడిట్ కార్డు బిల్లు కచ్చితంగా బిల్లింగ్ సమయం లోపల కడుతూ రావాలి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా ఉంటే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది.
క్రెడిట్ కార్డు బిల్లులు కరెక్ట్ టైమ్‌కు కట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.


క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యం చేస్తే ఆలస్య రుసుము(late fee) చెల్లించుకోవాలి. మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లో ఈ చార్జీలు కలిపి వస్తాయి. కట్టవలసిన మొత్తం కాకుండా వడ్డీ భారం కూడా మోయాల్సి వస్తుంది. మీ బిల్లు మొత్తాన్ని 60 రోజులు దాటిన తర్వాత కూడా కట్టకపోతే మాత్రం వడ్డీ రేట్ల భారం పెరుగుతుంది. సమయానికి రుణ వాయిదాలను చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారని రుణదాతలు(bank) గ్రహించి మీకు రుణం జారీచేయడం అధిక-రిస్క్‌గా భావిస్తారు.
మీ క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని కరెక్ట్ టైమ్‌కు కట్టకపోతే ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు(cibil) చేరుతుంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. తగ్గిన క్రెడిట్ స్కోరు మన భవిష్యత్‌లో రుణ అవకాశాలు, కొత్త క్రెడిట్ కార్డ్‌ల అర్హతను కూడా దెబ్బతీస్తుంది. ఈ ఎఫెక్ట్ మీ క్రెడిట్ స్కోర్‌పై ఏడేళ్ల వరకు ఉంటుంది. ఆలస్య రుసుము చెల్లిస్తే రివార్డు పాయింట్లు కూడా కోల్పోవలసి రావొచ్చు. అదే విధంగా 180 రోజుల సమయంలో కూడా క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం కట్టకపోతే మీ క్రెడిట్ మరియు పాన్ కార్డు సిబిల్ స్కోర్ అకౌంట్‌ను మొండి బకాయి కిందకు పరిగణిస్తారు. మీ క్రెడిట్ కార్డు పని చేయదు. ఇతర బ్యాంకులలో రుణం పొందటం కోసం కూడా క్రెడిట్ స్కోర్ సాయపడుతుంది. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో సక్రమంగా తిరిగి చెల్లించాలి.