కోవిడ్-19 రెడ్ ఆరేంజ్ జోన్లు గ్రీన్ జోన్లుగా ఎప్పుడు మారుతాయి

0
55
COVID ZONES

కరోనావైరస్ వ్యాప్తికి ముందు జోన్స్ వ్యవహారం ఎవరికీ తెలీదు.ఇప్పుడు అందరు అనుకుంటునప్పటికీ జోన్స్ ఏవిధంగా వర్గీకరిస్తారో అవగాహన లేదు. కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్, రెడ్ జోన్, ఆరేంజ్ జోన్, గ్రీన్ జోన్ లను ఏ విధంగా వర్గీకిస్తారు అనే విషయం ప్రభుత్వాలు ఈ విధంగా చెపుతున్నాయి. కోవిడ్-19 కేసులను గుర్తించిన నిర్దిష్ట ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా పిలుస్తారు అలాగే.

కంటైన్మెంట్ జోన్ చుట్టూ ఉన్న ప్రాంతం, కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్‌గా పిలుస్తారు. ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉండి. వ్యాప్తి శాతం ఎక్కువగా విస్తరిస్తున్న ప్రాంతాలను రెడ్ జోన్‌ లేదా హాట్ స్పాట్ గా పిలుస్తారు.కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదైన ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌గా పిలుస్తారు. కొద్ది కాలంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాని, లేదా ఒక్క కోవిడ్-19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా పిలుస్తారు.

ఏప్రిల్ 15 ముందు వరకు 15 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణించేవారు. తర్వాత దాని స్థితిగతులను మార్చారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులున్న జిల్లాను రెడ్‌ జోన్‌గా పిలుస్తారు. లేదంటే నాలుగు రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెట్టింపయిన జిల్లాను రెడ్ జోన్‌గా పరిగణిస్తారు.

ఇక రెడ్ జోన్‌గా ఉన్న ఏరియాలో 14 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకపోతే దాన్ని ఆరెంజ్‌ జోన్‌గా మారుస్తారు. ఆరెంజ్ జోన్‌ లో 14 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే దాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటిస్తారు. అంటే రెడ్ జోన్ -> గ్రీన్‌ జోన్‌గా మారాలంటే 28 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులేవీ నమోదు కాకూడదు అన్నమాట.

ఇందులో ఒక నిర్దిష్ట ప్రాంతంలో నాలుగు కంటే ఎక్కువ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైతే దాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా పిలుస్తారు. ఉదాహరణకు ఏదైనా ఇంటిలో లేదా బవనములలో లేదా అంతస్థులలో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువగా కోవిడ్-19 కేసులు నమోదైతే ఆ భవనం మొత్తాన్ని మూసివేసి శానిటైజు చేసి దాని చుట్టూ అర కిలోమీటర్ మేర ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తారు. కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్ చుట్టూ కిలోమీటర్ మేర ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా పిలుస్తారు. అంటే అక్కడ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. కంటైన్‌మెంట్ జోన్‌లో ప్రజల ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. నిత్యావసరాలు కూడా అధికారులే ఇళ్ల వద్దకు అందిస్తారు.

తెలంగాణ లో కోవిడ్-19 రెడ్ ఆరేంజ్ గ్రీన్ జోన్లు లిస్ట్ కోసం ఈ లింకుని క్లిక్ చేయండి

https://www.techdestinynews.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d-19-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0/